13 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telugu Lo Computer
0


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా ఈ నెల 10వ తేదీన తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ను  ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు సభలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 11న అసెంబ్లీకి సెలవు నిర్ణయించగా 12వ తేదీన బడ్జెట్ పై చర్చ జరగనుంది. అలాగే ఈనెల 13 వ తేదీన బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. అనంతరం సమావేశాలు ముగియనున్నాయి. అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)