మే 10 లోగా భారత బలగాలన్నీ వెళ్లిపోతాయి !

Telugu Lo Computer
0


భారత బలగాల పూర్తి ఉపసంహరణ మే 10 నాటికి ముందే పూర్తవుతుందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఆయన పార్లమెంట్‌లో తొలి ప్రసంగం చేస్తూ  'మా సార్వభౌమత్వం విషయంలో మరొక దేశం జోక్యాన్ని మేం అనుమతించం' అని స్పష్టం చేశారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం తమ దేశంలో ఉన్న మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వహిస్తున్న భారత బలగాలు మార్చి 10లోగా వెళ్లిపోతాయని, మిగతా రెండు స్థావరాల్లో ఉన్న దళాలు మే 10 లోగా వైదొలుగుతాయని ముయిజ్జు తెలిపారు. ఈ విషయంలో భారత్‌తో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడం లేదని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)