మోమోస్‌లో రెడ్‌ సాస్‌ ఎక్కువ అడిగాడని కస్టమర్‌పై కత్తితో దాడి !

Telugu Lo Computer
0


ఢిల్లీ, షాహ్దారాలోని ఫార్స్‌ బజార్‌ ఏరియాలో సందీప్‌ అనే వ్యక్తి మోమోస్‌ తినేందుకు ఓ వీధి వ్యాపారి వద్దకు వెళ్లాడు. మోమోస్‌ కొనుగోలు చేసిన తర్వాత రెడ్‌ సాస్‌ అదనంగా కావాలని అడిగాడు. దాంతో వీధి వ్యాపారి వికాస్‌  లేదని చెప్పాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సందీప్‌ ముఖంపై వికాస్‌ కత్తితో పొడిచి పారిపోయాడు. ఈ కత్తి దాడిలో ముఖంపై తీవ్ర గాయాలైన వికాస్‌ హెడ్గెవార్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యి చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరుగగా, గురువారం ఉదయం పోలీసులు నిందితుడు వికాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)