జిమ్ నుంచి తిరిగొస్తుండగా తుపాకీతో కాల్చివేత !

Telugu Lo Computer
0


నోయిడా సెక్టార్ 104లో సూరజ్ భాను అనే యువకుడు శుక్రవారం తెల్లవారుజామున జిమ్‌కు వెళ్లాడు. జిమ్ ముగించుకున్న అనంతరం ఇంటికి కారులో బయల్దేరాడు. మార్గమధ్యలో అతన్ని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి తుపాకీతో కాల్పులు జరిపారు. అనంతరం బైక్‌పై పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న సూరజ్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో సూరజ్ డెడ్‌బాడీని పోస్టుమార్టంకు తరలించారు. మర్డర్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుండగులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)