ఎస్సీ కులాల వర్గీకరణపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం కమిటీ ఏర్పాటు !

Telugu Lo Computer
0


ఎస్సీ కులాల వర్గీకరణ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వర్గీకరణపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.  కేంద్ర హోం శాఖ, న్యాయ శాఖ, గిరిజన, సామాజిక శాఖల కార్యదర్శులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన దళిత దండోర సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. ప్రస్తుతం ఇచ్చిన హామీ ప్రకారం కమిటీని ఏర్పాటు చేశారు. జనవరి 22న కమిటీ తొలి సమావేశం జరిగే అవకాశం ఉంది. కాగా కమిటీకి కాల పరిమితి అనేది ప్రకటించలేదు. కాకపోతే వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని కమిటీకి కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)