ఇజ్రాయెల్ - హమాస్ సంధి కి సిద్ధం ?

Telugu Lo Computer
0

జ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతున్న గాజా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు మరోసారి సంధికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పారిస్ వేదికగా ఈజిప్ట్, ఖతార్, ఇజ్రాయెల్  ఉన్నతాధికారులు భేటీ అయినట్లు సమచారం. ఈ యుద్ధం వల్ల ప్రపంచశాంతికి భంగం కలుగుతోందని అన్ని దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పలు వెస్ట్రన్ దేశాలు యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ని కోరుతున్నాయి. మరోవైపు హమాస్ పూర్తిగా అంతమయ్యే వరకు యుద్ధాన్ని విరమించే ప్రసక్తే లేదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పలుమార్లు వెల్లడించారు. ఇరు వర్గాల మధ్య సంధి కోసం ఫ్రెంచ్ అధికారులు ఖతార్, పాలస్తీనా, ఈజిప్ట్, ఇజ్రాయెల్  అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అమెరికా సీఐఏ చీఫ్ విలియం బర్న్స్ ఇజ్రాయెల్, ఈజిప్ట్ అధికారులతో పాటు రాబోయే రోజుల్లో ఖతార్ ప్రధానిని కలుస్తారని పలువర్గాలు వెల్లడించాయి. కాల్పుల విరమణకు బదులుగా హమాస్ ఆధీనంలో ఉన్న మిగిలిన బందీలను విడుదల చేసేందుక చర్చలు జరపడానికి యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ సీఐఏ చీఫ్‌ని పంపుతున్న గత వారం ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. 100 మందికి పైగా బందీలను విడుదల చేస్తే ప్రతిఫలంగా గాజాలో ఇజ్రాయెల్ తన యుద్ధాన్ని రెండు నెలల పాలు నిలిపివేసే ఒప్పందాన్ని అమెరికా నేతృత్వంలోని మధ్యవర్తులు సంధి చేస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ శనివారం వెల్లడించింది. ఇప్పటికే సంధిక సంబంధించిన ముసాయిదా సిద్ధమైందని ఆదివారం పారిస్‌లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)