గ్యాస్ సమస్య - జాగ్రత్తలు !

Telugu Lo Computer
0


చాలా మంది గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధ పడుతూ ఉంటున్నారు. తినేటప్పుడు ఉన్నంత సంతోషం.. కాసేపటిలోనే ఆవిరి ఆయిపోతుంది. దీంతో ఏం తినాలన్నా భయంగా మారుతుంది. దీనికి ప్రధాన కారణం గ్యాస్. కాస్త ఘాటుగా, కారంగా ఉన్న ఫుడ్ ఐటెమ్స్ తింటే చాలు గ్యాస్ పట్టేస్తుంది. దీని వల్ల పని చేసుకోవడానికి కూడా కష్టంగా మారుతుంది. గ్యాస్ సమస్య రెండు రకాలుగా ఉంటుంది. కొందరు కడుపులో గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే మరి కొందరు ప్రేగుల్లో గ్యాస్ సమస్యతో బాధ పడుతూ ఉంటున్నారు. ఇంకొంత మంది ఛాతీలో గ్యాస్ ప్రాబ్లమ్‌తో అల్లాడుతున్నారు.  ప్రేగుల్లో మలం లేకుండా చూసుకోవాలి. ప్రేగుల్లో మలం ఉండటం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. దీంతో ఆహారం పులిసి గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఎప్పుడూ ప్రేగులు శుభ్రంగా ఉంచుకోవాలి. పరగడుపున గోరు వెచ్చటి నీళ్లు తాగడం వల్ల సుఖ విరోచనం అవుతుంది. ఇలా ఉదయం బాత్రూమ్‌కి రెండు సార్లు వెళ్తే  ప్రేగుల్లో ఉండే మలం అంతా బయటకు పోతుంది. అలాగే ఆహారం తినేటప్పుడు ఎక్కువగా నీరు తాగకూడదు. కనీసం అరగంట లేదా గంట తర్వాత తాగాలి. గ్యాస్ సమస్యతో ఉన్నవారు ఘాటు పదార్థాలకు దూరంగా ఉండటం మేలు. అలాగే ఉదయం, సాయంత్రం పండ్లు తినాలి. పండ్లు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ గాడిలో పడుతుంది. సాయంత్రం 7 గంటల లోపు ఆహారం తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే.. గ్యాస్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. 

Post a Comment

0Comments

Post a Comment (0)