స్పీడ్ పోస్ట్ ద్వారా చివరి నిమిషంలో ఉద్ధవ్ ఠాక్రే ఆహ్వానం !

Telugu Lo Computer
0


యోధ్యలోని రామ మందిరంలో ప్రతిష్టాపన సోమవారం జరుగనున్నది. మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్‌ ఉద్ధవ్ ఠాక్రేకు  స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ కార్యక్రమం ఆహ్వానం అందింది. అయితే అయోధ్య ఉద్యమంతో సంబంధం ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు చివరి నిమిషంలో స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా ఆహ్వానం పంపడంపై ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఠాక్రే కుటుంబం పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సంజయ్ రౌత్ మండిపడ్డారు. 'సినిమా తారలందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. ఉద్యమంతో సన్నిహితంగా ఉన్న ఠాక్రే కుటుంబం పట్ల ఈ విధంగా వ్యవహరిస్తారు' అని విమర్శించారు. కాగా, ఉద్ధవ్ ఠాక్రే సోమవారం నుంచి రెండు రోజులు నాసిక్‌లో పర్యటించిస్తారని సంజయ్ రౌత్‌ తెలిపారు. సోమవారం కాలారం ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడంతోపాటు గోదావరి నది ఒడ్డున మహా హారతి నిర్వహిస్తారని చెప్పారు. మంగళవారం నాసిక్‌లో జరిగే పార్టీ సమావేశంలో ఉద్ధవ్‌ ఠాక్రే పాల్గొంటారని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)