ప్రతి నెలా ఐదవ తేదీలోగా జీతాలు, పెన్షన్లు !

Telugu Lo Computer
0


ద్యోగులకు ప్రతి నెలా ఐదవ తేదీలోగా జీతాలు, పెన్షన్లూ చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకే విడతలో డీఏ  (కరవు భత్యం) చెల్లిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అందువల్ల ఈసారి డీఏ ఒకే విడతలో వచ్చేస్తుంది అని అనుకోవచ్చు. గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉద్యోగులకు మూడు డీఏలు ఇవ్వాల్సి ఉండగా పెండింగ్ పెట్టింది. ఇంతలో ఎన్నికల కోడ్ వచ్చేసింది. దాంతో డీఏలు చెల్లించలేకపోయింది. ఒక డీఏ చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)ని కోరింది. సరేనన్న ఈసీ.. ఒక డీఏ విడుదలకు డిసెంబర్ 2న అనుమతి ఇచ్చింది. అందువల్ల గత ప్రభుత్వం ఒక డీఏ విడుదల చేసి ఉంటే, ఇంకా రెండు డీఏలు పెండింగ్ ఉంటాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే విడదల డీఏ చెల్లిస్తామని చెప్పింది కాబట్టి.. ఎన్ని డీఏలు పెండింగ్ ఉంటే, అన్నీ ఒకేసారి ఇస్తుంది అని అనుకోవచ్చు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగానే అన్నీ చేస్తే, ప్రభుత్వ ఉద్యోగులకు అది మంచి వార్తే అవుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం జీతాలను టైముకి చెల్లించలేదనీ, డీఏ కూడా పెండింగ్స్ పెట్టిందని ఉద్యోగులు ఆవేదన చెందారు. కొత్త ప్రభుత్వమైనా తమకు అనుకూలంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అంటోంది. అందువల్ల పైన చెప్పిన రెండు అంశాలూ ఉద్యోగులకు కొంత ఆనందం కలిగిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)