పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డును తొలగించిన ఈపీఎఫ్ఓ !

Telugu Lo Computer
0


ద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పుట్టిన తేదీ రుజువుగా ఆమోదయోగ్యమైన పత్రాల జాబితా నుంచి ఆధార్ కార్డును తొలగించింది. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఆదేశాల అనంతరం పుట్టిన తేదీకి ఆమోదయోగ్యమైన పత్రంగా ఆధార్ కార్డ్‌ను తొలగించినట్టు ఈపీఎఫ్ఓ తెలిపింది. ఈ మేరకు జనవరి 16న జారీ చేసిన సర్క్యులర్‌లో ఆధార్ అనేది ప్రాథమికంగా గుర్తింపు ధృవీకరణ మాత్రమేనని, అది పుట్టిన తేదీకి రుజువు కాదని ​​పేర్కొంది. ఈ సర్క్యులర్‌కు సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ నుంచి అనుమతి లభించింది. ఇటీవలి కొన్ని కోర్టు తీర్పులు కూడా ఆధార్‌ను పుట్టిన తేదీకి రుజువుగా పరిగణించలేమని తేల్చిచెప్పాయి. ఇక నుంచి ఆధార్ కార్డును వయసు నిర్ధారణకు వినియోగించరాదని ఈపీఎఫ్ఓ సంస్థ వెల్లడించింది. అంతేకాదు.. పుట్టిన తేదీ రుజువుగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్ల జాబితాను కూడా ప్రకటించింది. దీనికి సంబంధించి యూఐడీఏఐ నుంచి కాపీ జతచేసిన లేఖ అందినట్టు తెలిపింది. అందులో ఆధార్‌ను పుట్టిన తేదీ రుజువుగా ఉపయోగించడం, ఆమోదయోగ్యమైన పత్రాల జాబితా నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీని ప్రకార జెడీ ఎస్‌ఓపిలోని అనుబంధం-1 టేబుల్-బిలో ప్రస్తావించిన విధంగా పుట్టిన తేదీలో దిద్దుబాటు కోసం ఆమోదయోగ్యమైన పత్రాల జాబితా నుంచి ఆధార్‌ను తొలగిస్తున్నట్లు సర్క్యులర్‌లో పేర్కొంది. ఈపీఎఫ్ఓకు పుట్టిన తేదీ రుజువుగా చెల్లుబాటు అయ్యే పత్రాలుగా ఏదైనా గుర్తింపు పొందిన ప్రభుత్వ బోర్డు లేదా యూనివర్సిటీ జారీ చేసిన మార్క్‌షీట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ (SLC)/ స్కూల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC)/ SSC సర్టిఫికేట్ పేరు, పుట్టిన తేదీని కలిగి ఉండాలి. సర్వీస్ రికార్డుల ఆధారంగా సర్టిఫికేట్, పాన్ కార్డ్, కేంద్ర/రాష్ట్ర పెన్షన్ చెల్లింపు ఆర్డర్, ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్, ప్రభుత్వ పెన్షన్, సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ను ప్రకటించింది. 


Post a Comment

0Comments

Post a Comment (0)