కాన్షీరామ్‌కు భారత రత్న ఇవ్వాలి !

Telugu Lo Computer
0


హుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌కు కూడా భారతరత్న ఇవ్వాలని ఆ పార్టీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మాయావతి తెలిపారు. కర్పూరీ ఠాకూర్ 100వ జయంతి వేడుకల సందర్భంగా మాయావతి ట్వీట్ చేశారు. కర్పూరీ ఠాకూర్ వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో పోరాడారని, సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేశారని మాయావతి గుర్తు చేశారు. మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వడం సమంజసమే.. అదే విధంగా దళితులు ఆత్మగౌరవంతో జీవించేలా కాన్షీరామ్‌కు చేసిన కృషికి కూడా గౌరవం దక్కాలని మాయావతి అన్నారు. దళితులు ఆత్మగౌరవంతో జీవించేందుకు, వారి కాళ్లపై నిలబడేలా చేయడంలో కాన్షీరామ్ చేసిన కృషి చారిత్రాత్మకం, మరువలేనిది.. కాబట్టి ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)