బెంగళూరులో మళ్లీ గుర్రాలతో పోలీసు గస్తీ !

Telugu Lo Computer
0


బెంగళూరు నగర వ్యాప్తంగా రద్దీ ప్రాంతాలలో ద్విచక్రవాహనాలు, హొయ్సళ అత్యవసర వాహనాలతో పాటు గుర్రాలతోను పోలీసు గస్తీ చేపట్టనున్నారు. గతంలో బెంగళూరులో గుర్రాలతో పోలీసు గస్తీ కొనసాగేది. ఇటీవల కాలంలో నగర విస్తీర్ణం పెరగడం అందుకు అనుగుణంగా ప్రాంతాల వారీగా పోలీసుస్టేషన్‌లు ఏర్పాటు కావడంతో బందోబస్తు చర్యలు కొనసాగుతున్నాయి. కానీ వారాంతంతో పాటు ప్రత్యేక వేడుకలు వేలాది మంది ప్రజలు పాల్గొనే కార్యక్రమాల మధ్యలోకి వాహనాలతో పోలీసులు వెళ్ళే పరిస్థితి ఉండదు. అందుకే గుర్రాల ద్వారా గస్తీ కొనసాగించే ఆలోచన ఉందని నగర పోలీసు కమిషనర్‌ దయానంద్‌ తెలిపారు. ఇప్పటికే మైసూరు నగరంలో పోలీసుశాఖ ఒక కంపెనీ గుర్రాల ద్వారా గస్తీ చేపట్టనుంది. ఎస్పీ స్ధాయి అధికారి వాటి పర్యవేక్షణా బాధ్యతలు తీసుకుంటారు. అదే తరహాలోనే బెంగళూరులోను గుర్రాలతో గస్తీ కొనసాగించదలచినట్లు తెలిపారు. ప్రత్యేకించి వారంతంలో కబ్బన్‌పార్క్‌, విధానసౌధ, మెజిస్టిక్‌, ఎంజీరోడ్‌, లాల్‌బాగ్‌ వంటి ప్రదేశాలలో గస్తీ కొనసాగిస్తామన్నారు. గతంలో బెంగళూరులో గుర్రాల ద్వారా పోలీసు బందోబస్తు చర్యలు కొనసాగేవని, ఇటీవల కొన్నేళ్ళ దాకా కబ్బన్‌పార్కులో పర్యవేక్షణ ఉండేదని పలు కారణాలతో రద్దు చేసిన గుర్రాల ద్వారా గస్తీని కొనసాగించిదలచామన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)