సిద్ధు క్షేత్రి గిన్నిస్‌ రికార్డు !

Telugu Lo Computer
0


భారత్‌కు చెందిన సిద్ధు క్షేత్రి గిన్నిస్‌ రికార్డు సాధించారు. మార్షల్‌ ఆర్టిస్ట్‌ అయిన సిద్ధు పంచింగ్‌ బ్యాగ్‌పై 55 గంటల 15 నిమిషాల పాటు పంచులు వేశారు. నిబంధనల ప్రకారం ప్రతి సెకనుకు కనీసం ఒక పంచ్‌ వేయాల్సి ఉంటుంది. ఐదు నిమిషాలు ఎక్కువగా శ్రమించి ఆయన గతంలో ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. గతంలోనూ సిద్ధు రెండు సార్లు గిన్నిస్‌ రికార్డు సాధించారు. 2013లో ఒంటి కాలితో మూడు నిమిషాల్లో 620 కిక్కులిచ్చారు. 2011లో నిమిషంలో 168 కిక్కులిచ్చి రికార్డు సృష్టించారు. ''మార్షల్స్‌ ఆర్ట్స్‌పై ఉన్న ఆసక్తితో 25 ఏళ్లుగా సాధన చేస్తున్నా. అన్ని గంటల పాటు నిద్రలేకుండా శ్రమించడం చాలా కష్టం. కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహంతో ఇదంతా సాధ్యమైంది. దేశానికి నా వంతు సహకారం అందించాలనుకున్నా. అదే పట్టుదలతో ప్రపంచ రికార్డు కోసం శ్రమించా'' అని సిద్ధు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)