తైవాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో విలియం లై చింగ్ ఘన విజయం

Telugu Lo Computer
0

తైవాన్‌ కొత్త అధ్యక్షుడిగా విలియం లై చింగ్-తే పగ్గాలు చేపట్టనున్నారు. శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు చెందిన అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) ఘన విజయం సాధించింది. తైవాన్ ప్రధాన ప్రతిపక్ష కోమింటాంగ్ పార్టీ చీఫ్‌ హౌ యు-ఇహ్ ఎన్నికలలో ఓటమిని అంగీకరించారు. చైనా ప్రాదేశిక వాదనను తిరస్కరించే అధికార డీపీపీ, తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించింది. కాగా, ప్రమాదకర తీవ్రవాదిగా చైనా ఆరోపించిన ప్రస్తుత ఉపాధ్యక్షుడైన విలియం లై చింగ్ ఈసారి అధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని తాము గౌరవిస్తామని తెలిపారు. ' ప్రజాస్వామ్యాన్ని మేం ఎంతగా ఆదరిస్తున్నామో ప్రపంచానికి చూపించాం. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలతో మేం నిలబడతాం' అని అన్నారు. ఈ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు బాహ్య శక్తులు చేసిన ప్రయత్నాలను తైవాన్ ప్రజలు విజయవంతంగా ప్రతిఘటించారంటూ చైనాను పరోక్షంగా విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)