ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ !

Telugu Lo Computer
0


తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియమితులయ్యారు. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదించారు. వారిద్దరిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో తమిళిసై ఈ నిర్ణయం తీసుకునున్నారు. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లి ఎమ్మెల్సీల అంశంపై చర్చించారు. కాగా, టీజేఎస్ పార్టీ అధినేత కోదండరాం 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన విషయం తెలిసిందే. 2023 ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)