ప్రధానమంత్రి సూర్యోదయ యోజన !

Telugu Lo Computer
0


యోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత ఢిల్లీకి చేరిన ప్రధాని నరేంద్ర మోడీ మరో కొత్త ప్రథకాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన  ద్వారా కోటి ఇళ్లపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు.  ఈ పథకంపై జరిగిన సమీక్షా సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు. 'ప్రపంచంలోని భక్తులంతా ఎల్లప్పుడూ సూర్యవంశీయుడైన శ్రీరాముడి నుంచి కాంతిని, శక్తిని పొందుతారు. ఈ రోజు అయోధ్యలో పవిత్ర ప్రతిష్ఠాపన శుభ సందర్భంగా, భారతదేశంలోని ప్రజల ఇళ్లపై సొంత సౌర వ్యవస్థ కలిగి ఉండాలన్న తీర్మానం మరింత బలపడింది' అని ఎక్స్‌లో పేర్కొన్నారు. అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాను తీసుకున్న మొదటి నిర్ణయమని ప్రధాని మోడీ తెలిపారు. 'కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేసే లక్ష్యంతో ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ను మా ప్రభుత్వం ప్రారంభించనున్నది' అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ చర్య ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు కరెంటు బిల్లులు తగ్గడమే కాకుండా ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబనగా మారుస్తుందని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)