భూమ్మీద అత్యంత అదృష్టవంతుడిని నేనే !

Telugu Lo Computer
0


యోధ్య రాముడి విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తొలిసారి స్పందించారు. భూమిపై అత్యంత అదృష్టవంతుడని భావిస్తున్నానని ఆయన అమితానందం వ్యక్తం చేశారు. ఇదంతా కల మాదిరిగా అనిపిస్తోందని అన్నారు. “నా పూర్వీకులు, కుటుంబ సభ్యులు, ఆ భగవంతుడు శ్రీరాముడి ఆశీర్వచనాలు నాకు ఎప్పటికీ ఉంటాయి. కొన్నిసార్లు నేను కలల ప్రపంచంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది'' అని యోగిరాజ్ అన్నారు. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించే రాముని విగ్రహాన్ని ఎంపిక చేయడానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సమావేశంలో ఓటింగ్ నిర్వహించారు. ప్రత్యేక శిల్పులు రూపొందించిన మూడు నమూనాల్లో ఒక విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఇందులో యోగిరాజ్ చెక్కిన బాలరాముని విగ్రహానికి ఎక్కువ ఓట్లు పొందిన అత్యుత్తమ విగ్రహంగా నిలిచింది. కాగా.. కర్ణాటకకు చెందిన శిల్పి యోగిరాజ్.. గతంలో ఎన్నో దేవాలయాల కోసం ఎన్నో విగ్రహాలను రూపొందించాడు. అయినప్పటికీ.. రామ్ లల్లా విగ్రహం కోసం యావత్ దేశం ఎదురుచూసిందని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వేయి కళ్లతో ఎదురుచూశారని.. ఇలాంటి అనుభూతి ఎప్పుడూ పొందలేదని శిల్పి చెప్పాడు. యోగిరాజ్ తన కుటుంబంలో ఐదవ తరం శిల్పి.

Post a Comment

0Comments

Post a Comment (0)