నాటో దేశాల జోలికి రష్యా వస్తే అది మూడో ప్రపంచయుద్ధానికి నాంది !

Telugu Lo Computer
0


క్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జర్మనీ పర్యటనకు వెళ్లారు. అక్కడి స్టేట్ మీడియాతో మాట్లాడుతూ రష్యా, నాటో దేశాల జోలికి వస్తే అది మూడో ప్రపంచయుద్ధానికి నాంది అవుతుందని అన్నారు. జర్మనీ ఉక్రెయిన్‌కి టారస్ క్షిపణులను సరఫరా చేయలేదని మీరు నిరాశ చెందారా..? అని అక్కడి మీడియా ప్రశ్నించిన నేపథ్యంలో జెలన్స్కీ మాట్లాడుతూ ఉక్రెయిన్‌పై రష్యా మొదటి ఆక్రమణ సమయంలో అది పోషించాల్సిన పాత్ర పోషించలేదని అందుకు నిరాశ చెందినట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 2022లో మాస్కో, ఉక్రెయిన్‌పై దండెత్తింది. అయితే అంతకు పూర్వం 2014లో రష్యా, ఉక్రెయిన్ భూభాగం క్రిమియాను స్వధీనం చేసుకుంది. ఆ సమయంలో జర్మనీ బలంగా స్పందించలేదని ఆయన అన్నారు. యూఎస్‌లో ఉక్రెయిన్‌కి మద్దతు ఉందని, డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ మద్దతు ఇస్తున్నారని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వస్తే ఏదైనా ప్రభావితం చేస్తుందా..? అని అడిగితే.. యూఎస్ విధానం ఒక్క వ్యక్తిపై ఆధాపడదని అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)