మళ్లీ పెళ్లి చేసుకున్న షోయబ్‌ మాలిక్‌!

Telugu Lo Computer
0


పాకిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌, సానియా మీర్జా భర్త షోయబ్‌ మాలిక్‌ పాకిస్తానీ నటి సనా జావెద్‌ను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని షోయబ్‌ మాలిక్‌ స్వయంగా వెల్లడించాడు. సోషల్‌ మీడియా వేదికగా తమ పెళ్లి ఫొటోలు పంచుకుంటూ ''జంటగా మేము ఇలా'' అంటూ హార్ట్‌ ఎమోజీలు జతచేశాడు షోయబ్‌ మాలిక్‌. కాగా భారత టెన్నిస్‌ స్టార్‌, హైదరాబాదీ సానియా మీర్జా- షోయబ్‌ మాలిక్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2010లో వీరి వివాహం జరుగగా, 2018లో కుమారుడు ఇజహాన్‌ జన్మించాడు. అయితే, సానియా కంటే ముందు షోయబ్‌ మాలిక్‌ అయేషా సిద్దిఖీ అనే మహిళను పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఆమె నుంచి విడిపోయిన తర్వాత సానియాను పెళ్లాడినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సానియా- షోయబ్‌ మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి. వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వదంతులు వ్యాపించాయి. నటి ఆయేషాతో ఓ ఫొటోషూట్‌లో షోయబ్‌ మాలిక్‌ అత్యంత సన్నిహితంగా కనిపించడం, అదే సమయంలో హృదయం ముక్కలైందంటూ సానియా పోస్టులు పెట్టడం వీటికి ఊతమిచ్చింది. అదే విధంగా కుమారుడి పుట్టినరోజు వేడుకలోనూ సానియా- షోయబ్‌ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించడంతో విడాకుల వార్తలు విస్తృతంగా వ్యాపించాయి. ఈ నేపథ్యంలో సానియా మీర్జా బుధవారం నర్మగర్భ సందేశం పోస్ట్‌ చేయడంతో వీరు విడిపోయారని నెటిజన్లు నిర్ధారణకు వచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)