కాగ్‌ నియామకంపై కేంద్రాన్ని స్పందన కోరిన సుప్రీంకోర్టు !

Telugu Lo Computer
0


కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నియామక ప్రక్రియపై దాఖలైన పిల్‌పై సుప్రీంకోర్టు గురువారం కేంద్రం స్పందన కోరింది. కాగ్‌ను నియమించే కార్యనిర్వాహక వ్యవస్థలో పారద్శకత లోపించిందని, నిస్పక్షపాతంగా, స్వతంత్రంగా లేదంటూ సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ వాదనలను సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పరిగణలోకి తీసుకున్నది. అనుపమ్‌ కులశ్రేష్ఠతోపాటు పలువురు పిల్‌ను దాఖలు చేయగా ధర్మాసనం కేంద్ర న్యాయ, ఆర్థిక మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీచేసింది. కాగ్ నియామకం కోసం అనుసరించిన ప్రక్రియ భారత రాజ్యాంగం విరుద్ధమని పిటిషనర్‌ పేర్కొన్నారు. ప్రస్తుత విధానంఓల కేంద్ర కేబినెట్‌ సెక్రెటరీ నేతృత్వంలోని క్యాబినెట్ సెక్రటేరియట్, ప్రభుత్వ ఉన్నత స్థాయి ఆడిటర్ నియామకానికి సంబంధించి షార్ట్‌లిస్ట్ చేసిన పేర్ల జాబితాను ప్రధానికి పంపుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. షార్ట్‌లిస్ట్ చేసిన పేర్లను ప్రధానమంత్రి పరిగణలోకి తీసుకుంటారని, ఇందులో ఒక పేరును రాష్ట్రపతి ఆమోదం కోసం సిఫారసు చేశారని.. ఆమోదం పొందిన తర్వాత ఎంపికైన వ్యక్తిని కాగ్‌గా నియమిస్తారని పిల్‌ పేర్కొన్నది. ప్రస్తుత విధానంలో కేబినెట్‌ సెక్రటేరియట్ ప్రధానమంత్రి పరిశీలన కోసం 'స్థాపిత ప్రమాణాలు లేకుండా' పేర్లను షార్ట్‌లిస్ట్ చేస్తుందని.. ప్రధానమంత్రి ప్రతిపాదించిన ఒకే పేరును రాష్ట్రపతి ఆమోదించే ఈ ప్రక్రియ.. కాగ్‌ స్వతంత్రత.. రాజ్యాంగం ఉద్దేశానికి విరుద్ధంగా ఉందని పిటిషనర్‌ పేర్కొన్నారు. కాగ్‌ నియామకానికి ప్రస్తుత విధానంలో స్వతంత్రత లేనట్లుగా కనిపిస్తోందని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థాపకులు కార్యనిర్వాహక, శాసనసభ నుంచి కాగ్‌ స్వతంత్రత అతి ముఖ్యమైన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారని.. అనధికారిక ప్రభుత్వ వ్యయాన్ని నిరోధించడం ద్వారా కాగ్‌ని అప్రమత్తమైన పర్యవేక్షకుడిగా ఏర్పాటు చేయడమే వారి వారి ఉద్దేశమని పిల్‌ పేర్కొంది. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ రాజ్యాంగ ఆడిటర్‌గా వ్యవహరిస్తారు, ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను పర్యవేక్షిస్తారని పిటిషనర్‌ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)