కోర్టుల్లో కులం, మతం తీసుకురావద్దు !

Telugu Lo Computer
0


హైకోర్టులోగాని, కింది స్థాయి కోర్టుల్లో పిటిషన్​ గాని మొమో గాని దాఖలు చేసేటప్పుడు కులం, మతం ఈ రెండు పదాలు లేకుండా ఉండాలని అన్ని కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టులో పలు రకాలైన కేసులను న్యాయవాదులు వాదించేటప్పుడు కూడా ఈ రెండిటికి దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది. రాజస్థాన్​ లోని ఫ్యామిలీ కోర్టులో పెండింగ్​ ఉన్న వివాదాన్ని బదిలీ పిటిషన్​ అనుమతించిన జస్టిస్​ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన బెంచ్​ జారీ చేసిన మెమోలో భార్యభర్తల కులాన్ని పేర్కొనడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఈ మెమోను పరిశీలించిన సుప్రీంకోర్టు కోర్టుల్లో దాఖలు చేసిన ఏ పిటిషన్​ లో కూడా కులం.. మతం అని ప్రస్థావించకూడదని అన్ని కోర్టులను ఆదేశించింది. దిగువ కోర్టుల్లో దాఖలు చేసిన పార్టీల మెమోను మారిస్తే రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తుతుందని, ప్రస్తుత కేసులో ఇరుపక్షాల కులాన్ని కోర్టులో ప్రస్థావించారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. కోర్టుల్లో పిటిషన్​ దాఖలు చేసేటప్పుడు కులాన్ని.. మతాన్ని ప్రస్థావిస్తే ఆ పిటిషన్​ ల విచారణను తక్షణమే నిలిపివేయాలని తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాలను బార్‌లోని సభ్యులతో పాటు రిజిస్ట్రీ దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది. . 

Post a Comment

0Comments

Post a Comment (0)