బాత్ రూం క్లీనింగ్ రోబోట్ !

Telugu Lo Computer
0

బాత్ రూం ను ఎంతో చక్కగా శుభ్రం చేస్తూ తన దృష్టిని ఆకర్షించిన రోబోట్ గురించి ఓ వీడియోను మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. మొదట ఈ వీడియోను సోమాటిక్ అనే రోబోటిక్ క్లీనింగ్ సర్వీస్ అందించే కంపెనీ యూట్యూబ్ లో షేర్ చేసింది. కంపెనీ నెలవారీ ఫీజుతో సమర్థవంతంగా పనిచేసే రోబోట్ ను కస్టమర్లకు అందిస్తుంది. ఈ వీడియో చూసిన మహీంద్రా .. రోబోట్ పనితీరుకు ఫిదా అయిపోయాడు. ఈ క్లీనర్ రోబోట్ స్వయంగా ఇంతలా శుభ్రం చేస్తుందా.. అద్భుతం.. ఆటో మేకర్స్ గా మేం మా ఫ్యాక్టరీలో చాలా రకాల రోబోట్ లను ఉపయోగించాం.. కానీ ఈ అప్లికేషన్ చాలా బాగుంది. చాలా ముఖ్యమైనది కూడా.. ఇది మాకు కావాలి అని ఆనంద్ మహీంద్రా రాశాడు. ఆనంద్ మహీంద్రా పోస్ట్ కు 9వేల లైకులు వచ్చాయి. నెటిజన్లు బాగానే స్పందించారు. అయితే నెటిజన్లు స్పందన మిశ్రమంగా ఉంది. కొందరు బాత్ రూం క్లీనింగ్ రోబోట్ టెక్నాలజీ వినియోగాన్ని కొందరు సమర్థిస్తే, కొందరు విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)