కాంగ్రెస్ కో-ఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేసిన మల్లికార్జున ఖర్గే !

Telugu Lo Computer
0


ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో లోక్ సభ ఎన్నికల సన్నద్ధత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి రాష్ట్రాలకు సంబంధించిన నేతలు పాల్గొన్నారు. రాష్ట్రాలకు చెందిన లోక్ సభ ఇంచార్జిలతో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కో-ఆర్డినేటర్లు పార్టీకి కళ్లు, చెవులు లాంటివారని అన్నారు. మైక్రో లెవల్ లో రాజకీయ, సామాజిక పరిస్థితులు పరిశీలించాలని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలవాలని కో ఆర్డినేటర్లకు సూచించారు. లోక్ సభ ఎన్నికల సన్నద్ధత కోసం ఈ సమావేశం రెండు గ్రూపులుగా జరిగింది. మొదటి సమావేశంలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, లక్షద్వీప్ , పుదుచ్చేరి రాష్ట్రాల నేతలతో సమావేశం నిర్వహించారు. రెండవ సమావేశంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గోవా, అండమాన్ & నికోబార్ రాష్ట్రాలకు చెందిన కో-ఆర్డినేటర్ల మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా కో-ఆర్డినేటర్లు కాంగ్రెస్ పార్టీనీ ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రయత్నం చేయాలని మల్లికార్జున ఖర్గే తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)