చంద్రబాబు ప్రయాణించిన హెలికాప్టర్‌‎కి సమన్వయ లోపం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ నుంచి అరకు సభకు వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్‌‎ ఏటీసీతో పైలట్‌కు సమన్వయ లోపం ఏర్పడింది. నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో హెలికాప్టర్‌‎ వెళ్ళింది. పైలట్ రాంగ్‌రూట్‌లో వెళ్తున్నట్టు హెచ్చరించిన ఏటీసీ అధికారులు. ఏటీసీ హెచ్చరికలతో హెలికాప్టర్‌ వెనుదిరిగింది. కొంత సమయం తరువాత మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతి లభించింది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజుల క్రితం గుడివాడలో సభ జరుగగా శనివారం అరకులో పార్లమెంటర్ నియోజకవర్గంలో సభను నిర్వహించారు. ఈ సభకు హాజరయ్యే క్రమంలో విశాఖ నుంచి అరకు బయలుదేరారు. ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)