ఫ్రాన్స్‌కు తొలి 'గే' ప్రధానిగా గాబ్రియేల్ అట్టల్ !

Telugu Lo Computer
0


ఫ్రాన్స్ ప్రెసిడెంట్‌ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 34 ఏళ్ల విద్యా శాఖ మంత్రి గాబ్రియేల్ అట్టల్‌ను మంగళవారం తన కొత్త ప్రధాన మంత్రిగా నియమించారు. దేశ ప్రధాని పోస్టుకు తొలిసారిగా గే (స్వలింగ సంపర్కుడు) వర్గానికి చెందిన 34 ఏళ్ల గాబ్రియేల్ అట్టల్‌ పేరును మంగళవారం ప్రతిపాదించారు. దీంతో ప్రధాని పదవిని గాబ్రియేల్ అట్టల్‌ చేపట్టడం దాదాపు ఖరారైంది. త్వరలోనే అధికారిక లాంఛనాలతో ఆయన ప్రధాని పోస్టును చేపడతారు. ఇంత పిన్న వయస్కుడు ఫ్రాన్స్ ప్రధాని కానుండటం ఇదే తొలిసారి. ప్రధాని కాబోతున్న అట్టల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకుముందు వరకు దేశ ప్రధానిగా వ్యవహరించిన ఎలిజబెత్ బోర్న్(62) సోమవారం రోజే ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు రాజీనామా సమర్పించారు. ఈ ఏడాది జూన్‌లో యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా రెండోసారి కూడా ఎన్నికల్లో గెలవాలనే సంకల్పంతో మాక్రాన్ ఉన్నారు. ఈ క్రమంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసేందుకు రెడీ అవుతున్నారు. తన ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కొత్త మంత్రివర్గం కూర్పుతో బదులివ్వాలని ఆయన భావిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)