పార్లమెంట్ ఎన్నికల ముందు నితీష్‌ ఇలా వ్యవహరించడం సరికాదు !

Telugu Lo Computer
0

బీహార్ రాజకీయ పరిణామాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందిస్తూ నితీష్‌ కుమార్ తీరును తప్పుపట్టారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇలా వ్యవహరించడం సరైంది కాదని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రవర్తన మంచిది కాదని వ్యాఖ్యానించారు. అయినా తన అంచనా ప్రకారం ఎన్డీఏ కూటమికి నష్టమే జరుగుతుందని.. ఈ పరిణామం ఇండియా కూటమికే లాభకరమని అభిప్రాయపడ్డారు. గత నవంబర్‌లో జరిగిన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి సరిగ్గా సహకరించకపోవడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. ఐక్యత లేకపోవడం వల్లే ఆ మూడు రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకోగల్గిందని కేజ్రీవాల్ విశ్లేషించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)