మాల్దీవులతో వ్యాపారం మానుకోండి !

Telugu Lo Computer
0


భారత్-మాల్దీవుల మధ్య కొనసాగుతున్న దౌత్య వివాదం నేపథ్యంలో భారత వ్యాపార సంఘమైన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ మాల్దీవులతో వ్యాపారం చేయడం మానుకోవాలని కోరింది. ప్రధాని నరేంద్ర మోడీపై ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం లేదని వ్యాపార వర్గాలు అన్నాయి. మాల్దీవుల చర్యలకు వ్యతిరేకంగా ఈ బహిష్కరణకు పిలుపునిచ్చింది. భారత్‌లోని వ్యాపారులు, ఎగుమతిదారులు మాల్దీవులతో వ్యాపారానికి దూరంగా ఉండాలని CAIT సోమవారం కోరింది. ఈ సంస్థ జాతీయాధ్యక్షుడు బీసీ భార్టియా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్ వాల్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీని ఉద్దేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం వ్యాపారానికి ఆమోదయోగ్యం లేవని, వారి అగౌర ప్రవర్తనకు వ్యతిరేకంగా అసమ్మతి తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ''అంతర్జాతీయ సంబంధాలు పరస్పర గౌరవం మరియు సహకారంపై ఆధారపడి ఉండాలి, అయితే రాజకీయ నాయకులను ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తాయి. అవమానకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు క్షమాపణలు చెప్పాలి'' అని ఖండేల్వాల్, భార్టియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)