జనసేనతో పొత్తులో ఉన్నాం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోజనసేనతో పొత్తులో ఉన్నామని బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. బీజేపీతోనే ఉన్నామని జనసేన కూడా చెప్పిందని గుర్తు చేశారు. నిన్న మొన్న కార్యకర్తలతో మాట్లాడి పొత్తులపై అభిప్రాయాలను సేకరించామని తెలిపారు. అభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత ఆ నివేదికను హైకమాండ్‌కు పంపిస్తామని దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. పొత్తులపై తుది నిర్ణయం అధిష్ఠానమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇది ఎన్నికలకు ఒక నెల ముందు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)