పోలీసులు ఎన్ కౌంటర్ లో వినోద్ ఉపాధ్యాయ్ హతం !

Telugu Lo Computer
0


మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వినోద్ ఉపాధ్యాయ్ ను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హతమార్చారు. శుక్రవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో వినోద్ ఉపాధ్యయ్ ను చనిపోయాడని పోలీసులు తెలిపారు. వినోద్ ఉపాధ్యాయ్ అయోధ్య జిల్లాలోని మాయాబజార్ చెందినవాడు. అతనిపై దాదాపు పోలీసులు ఎన్ కౌంటర్ లో వినోద్ ఉపాధ్యాయ్ హతం పోలీసులు ఎన్ కౌంటర్ లో వినోద్ ఉపాధ్యాయ్ హతం మూడు  డజన్లకు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. సుల్తాన్‌పూర్ జిల్లాలోని కొత్వాలి ప్రాంతంలో వినోద్ ఉపాధ్యాయ్ యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. కాల్పుల్లో వినోద్‌కు గాయాలవ్వడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకోగానే వినోద్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మాఫియా డాన్ వినోద్‌తో జరిగిన ఎన్‌కౌంటర్ లో 30 బోర్ చైనా కంపెనీ తయారు చేసిన పిస్తల్, 9 ఎంఎం ఫ్యాక్టరీలో తయారు చేసిన స్టెన్ గన్‌తో పాటు లైవ్ మరియు ఖాళీ కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్విఫ్ట్ కారును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ దీపక్ సింగ్ ఈ ఎన్ కౌంటర్ కు హెడ్ గా వ్యవహరించారని సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)