ఇండియా కూటమి అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే

Telugu Lo Computer
0


ప్రతిపక్షాలకు చెందిన ఇండియా కూటమి చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంపికయ్యారు.ఇండియా కూటమికి చెందిన పార్టీల ముఖ్య నేతలు శనివారం ఉదయం వర్చువల్‌ విధానంలో సమావేశమయ్యారు. ఇండియా కూటమికి చెందిన పార్టీల ముఖ్య నేతలు శనివారం ఉదయం వర్చువల్‌ విధానంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా కూటమిని మరింత బలోపేతం చేయడం, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు, కూటమికి కన్వీనర్‌ నియామకం అంశాలపై వారు చర్చించారు. ప్రతిపక్ష నేతలంతా తీవ్ర చర్చలు జరిపి.. ఖర్గేను కన్వీనర్‌గా నియమిస్తూ నిర్ణయించారు. అయితే నీతీశ్‌ కుమార్‌ను కూటమి కన్వీనర్‌ చేయాలని జేడీయూ కోరగా.. ఆ ప్రతిపాదనను తృణమూల్‌ కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. కాగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌తో సహా విపక్ష పార్టీలు ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. నేటి సమావేశంలో భాగస్వామ్య పక్షాల మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాల పరిష్కారంపైనా దృష్టి సారించింది. అయితే వేరే ముందస్తు కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ భేటీలో పాల్గొనలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)