తెలంగాణలో ఓడీలు రద్దు చేస్తూ సర్కార్‌ ఉత్తర్వులు

Telugu Lo Computer
0


తెలంగాణలోని చెక్‌పోస్టులు, ఇతర ఆఫీసుల్లో ఆన్‌ డ్యూటీ (ఓడీ)పై పనిచేస్తున్న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, జూనియర్ అసిస్టెంట్లు సహా అందరూ వచ్చి తమ ఒరిజినల్ పోస్టింగుల్లో జాయిన్ కావాలని ప్రభుత్వం ఆదేశిం చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌లోని చాలా మంది ఉద్యోగులు, సిబ్బంది ఆన్‌ డ్యూటీ పేరిట తమ పోస్టింగ్‌కు బదులు చెక్‌పోస్టుల్లో పనిచేస్తున్నారు. చెక్‌ పోస్టుల్లో పనిచేయడం వెనుక అవినీతి వ్యవహారం దాగి ఉందన్న ఆరోపణలు న్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వీరందరినీ ఒరిజినల్ పోస్టింగుల్లో చేరాలని స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)