అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టిన కారు !

Telugu Lo Computer
0


మిళనాడులోని సింగిలిపట్టి, పున్నయపురం మధ్య నేటి తెల్లవారు జామున 3 గంటల సమయంలో కారు నడుపుతూ డ్రైవర్ కునుకులోకి జారడంతో వాహనం అదుపు తప్పి సిమెంట్ ట్రక్కును వేగంగా ఢీకొట్టింది. అయిదుగురు అక్కడికక్కడే చనిపోగా, తీవ్రగాయాల పాలైన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతులు కార్తిక్, వేల్ మనోజ్, సుబ్రమణి, మనోహరన్, పోతిరాజ్‌లుగా గుర్తించారు. మరో మృతుడి వివరాలు తెలియవలసి ఉంది. వారాంతపు విహారయాత్ర ముగించుకుని వారు కుట్రాళం నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం దృశ్యాలు సిసిటివీ కెమెరాలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీస్‌లు, అగ్నిమాపక సిబ్బంది, సహాయ బృందాలు ప్రమాదస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)