మహిళల సాధికారతకు చేయూత ఇవ్వండి !

Telugu Lo Computer
0


న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రముఖ స్టార్లప్‌లు, యూనికార్న్‌ల వ్యవస్థాపక, సహ వ్యవస్థాపక మహిళల బృందంతో  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంభాషిస్తూ, వారి విజయం ఎంత ప్రభావం చూపాలంటే 'అటువంటి విజయ గాథలను దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి మనం వినగలగాలి' అని సూచించారు. ప్రతి మహిళ సాధికారురాలు కాగల, ప్రతి యువ మహిళ తన కలల సాఫల్యానికి దృఢవిశ్వాసంతో ముందుకు సాగగల భారతం నిర్మాణానికి సంఘటితంగా కృషి చేయాలని మనం సంకల్పించాలని రాష్ట్రపతి హితవు పలికారు. 'ప్రజలతో రాష్ట్రపతి' కార్యక్రమం కింద గురువారం సమావేశం చోటు చేసుకుంది. ఆ కార్యక్రమం లక్షం ప్రజలతో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకుని, వారి సేవలను గుర్తించడం. కాగా, మహిళా పారిశ్రామికవేత్తలు భారతీయ వాణిజ్య వాతావరణాన్ని మార్చారని రాష్ట్రపతి ఆ సమావేశంలో చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)