వాము రసం - ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


వాము ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఇది వరకు వాము ఆకులు, వాము ఇంటి చుట్టుపక్కలే వేసేవారు. వాటితో రకరకాలైన ఆహారాలు తయారు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ముఖ్యంగా ఏవి పడితే ఆ హారాలు తినేస్తున్నారు. ఉడికీ ఉడకని ఆహారం తినడం వల్ల.. సరిగ్గా జీర్ణం అయ్యేది కాదు. దీంతో కడుపులో నొప్పి, అజీర్తి, పొట్ట పట్టేయడం వంటి సమస్యలు తలెత్తేవి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే.. వాము చాలా హెల్ప్ చేస్తుంది. వారం లేదా పది రోజులకు ఓ సారైనా వాముతో తయారు చేసే ఆహారాలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ అనేది శుభ్ర పడుతుంది. దీని వల్ల పొట్ట ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. అందులోనూ చలి కాలంలో వాముతో రసం చేసుకుని తింటే చాలా ఆరోగ్యం.

Post a Comment

0Comments

Post a Comment (0)