దేశంలో అత్యంత సంపన్నుడు గౌతమ్​ అదానీ !

Telugu Lo Computer
0


సుప్రీం కోర్టు తీర్పుతో గౌతమ్​ అదానీ సంపద అమాంతం పెరిగింది. దేశంలోనే అత్యంత సంపన్నుడు అయిన రిలయన్స్​ చైర్మన్​ ముకేశ్​ అంబానీని ఆయన మించిపోయారు. అదానీ గ్రూపునకు అనుకూలంగా తీర్పు రావడంతో అహ్మదాబాద్‌కు చెందిన ఈ సంస్థ కంపెనీల షేర్లు బుధవారం 12 శాతం వరకు పెరిగాయి. దీంతో మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15 లక్షల కోట్లకు చేరింది. ఈ లాభాల ఫలితంగా, గౌతమ్ అదానీ కుటుంబం అంబానీని అధిగమించింది. భారతదేశంలో అత్యంత సంపన్న ప్రమోటర్ గుర్తింపును తిరిగి సంపాదించుకుంది. బుధవారం గౌతమ్ అదానీ కుటుంబం నికర విలువ రూ.9.37 లక్షల కోట్లకు పెరిగింది. అంతకు ముందు రోజు దీని విలువ రూ.8.98 లక్షల కోట్లు. ఈ కాలంలో ముకేశ్‌ అంబానీ కుటుంబ నికర విలువ రూ.9.38 లక్షల కోట్ల నుంచి రూ.9.28 లక్షల కోట్లకు కొద్దిగా తగ్గింది. అదానీ గ్రూపు చైర్మన్​, బిలియనీర్ గౌతమ్ అదానీ గత డిసెంబర్ 6 నాటికి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ (బీబీఐ)లో 15వ స్థానానికి చేరుకున్నారు. అప్పుడే భారతదేశం, ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి కాస్త దూరంలో ఉన్నారు. 82.5 బిలియన్ డాలర్ల (6.8 లక్షల కోట్లు) నికర విలువతో నెట్​వర్త్​ ఈయన అప్పుడు ప్రపంచంలోని 15వ అత్యంత సంపన్నుడు. ఆసియాలోనే రెండో అత్యంత సంపన్న భారతీయుడు. అయితే గత సంవత్సరంలో 38 బిలియన్ డాలర్లను కోల్పోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)