అండు కొర్రలతో క్యాన్సర్ కు చెక్ ?

Telugu Lo Computer
0


ర్యావరణం, జీవన విధానంలో మార్పులతో క్యాన్సర్ ఇప్పుడు లంగ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, పేగు క్యాన్సర్ ఇలా ఎన్నో రూపాల్లో దాడి చేస్తుంది. అయితే క్యాన్సర్ కణాలకు కషాయాలతో చెక్ పెట్టవచ్చా..? అంటే అవుననే అంటున్నారు.. స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణుడు, హోమియో వైద్యుడు ఖాదర్ వలి. ఈయన “మిల్లెట్ మ్యాన్”గా సుపరిచితుడు. ఆరోగ్యం విషయంలో సిరిధాన్యాల ఆవశ్యకత గురించి అనేక పరిశోధనలు చేసిన వ్యక్తి. తాజాగా ఈయన క్యాన్సర్ గురించి ఓ అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజంట్ ఒక్కొక్కరు రెండు, మూడు రోగాలతో బాధపడుతున్నారని చెప్పారు. నిద్రపోవడానికి, బాత్రూంకి వెళ్లడానికి కూడా ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. 20 నుంచి 25 ఏళ్ల యువత కూడా రోగాల బారిన పడటం బాధగా ఉందన్నారు. అండు కొర్రలు తిన్నా, అండు కొర్రలుతో అంబలి చేసుకుని తాగినా క్యాన్సర్ నుంచి చాలా స్వాంతన ఉంటుందని చెప్పారు. అండు కొర్రలు రెండు రోజులు మిగిలిన తృణ ధాన్యాలు రెండు రోజులు లెక్క ఆరు నెలలు పాటు తింటే.. చాలా ప్రయోజనం ఉంటుంది అన్నారు. అలాగే క్యాన్సర్ ఉన్నవారు కానుగ ఆకు, తంగేడు ఆకు, ఈత ఆకు, జామ ఆకు, పారిజాతం ఆకు కషాయాలు తీసుకుంటే భయానక రోగాలు తరిమిగొట్టొచ్చు అని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)