పిల్లి ఆచూకీ తెలిపితే లక్ష బహుమతి !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్‌ 62 ప్రాంతంలో నివసించే అజయ్‌ కుమార్‌కు చెందిన పెంపుడు పిల్లి డిసెంబర్‌ 24 నుంచి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన ఆ ప్రాంతంలో పెద్ద పోస్టర్లు ఏర్పాటు చేశాడు. ఏడాదిన్నర వయసున్న పెర్షియన్ మగ పిల్లి తప్పిపోయినట్లు అందులో పేర్కొన్నాడు. బ్రౌన్‌ కలర్‌తోపాటు పిల్లి మెడ చుట్టూ తెలుపు రంగులో బొచ్చు ఉంటుందని వివరించాడు. మిస్సింగ్‌ క్యాట్‌ గురించి తన మొబైల్‌ నంబర్‌ ద్వారా సమాచారం అందించిన వారికి బహుమతిగా లక్ష నగదు ఇస్తానని ఆ పోస్టర్‌లో ప్రకటించాడు.కాగా, మిస్సింగ్‌ క్యాట్‌కు సంబంధించిన ఈ పోస్టర్‌ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. చాలా మంది నెటిజన్లు దీనిని షేర్‌ చేస్తున్నారు. తప్పిపోయిన పిల్లిని దాని యజమాని అజయ్‌ కుమార్‌ చెంతకు చేర్చేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు పిల్లి అదృశ్యం పట్ల తమ సానుభూతిని వ్యక్తం చేశారు. అలాగే పిల్లి ఆచూకీ కోసం లక్ష బహుమతి ప్రకటించడంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)