వజీరాబాద్‌ పోలీసు యార్డులో భారీ అగ్ని ప్రమాదం !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని వజీరాబాద్‌లో ఉన్న పోలీసు యార్డులో మంటలు చెలరేగి దాదాపు 450 వాహనాలు కాలి బూడిదయ్యాయి. సరైన పత్రాలు లేకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల వివిధ కేసుల్లో సీజ్‌ చేసిన వాహనాలను ఈ యార్డులో నిలిపిఉంచారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇక్కడ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు 200 ఫోర్‌ వీలర్లు, మరో 250 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయని వెల్లడించారు. ప్రమాదం ఎలా జరిగిందనేది ఇంకా తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)