విడాకులు తీసుకుంటున్న అల్బేనియా యువరాజు

Telugu Lo Computer
0


ల్బేనియా యువరాజు క్రౌన్‌ ప్రిన్స్‌ దంపతులు తమ వివాహ బంధానికి స్వస్తి పలకనున్నారు. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రాం వేదికగా యువరాజు ఓ ప్రకటన చేశారు. ఐరోపా దేశమైన అల్బేనియాకు చెందిన క్రౌన్‌ ప్రిన్స్‌ లేక, క్రౌన్‌ ప్రిన్సెస్‌ ఎలియా ఝరాయా.. 2016లో వైభవంగా వివాహం చేసుకున్నారు. 2020లో వారికి ఓ కుమార్తె జన్మించింది. ఎనిమిదేళ్ల వైవాహిక బంధాన్ని కొనసాగించే వీలులేకపోవడంతో తాము విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు లేక తెలిపారు. 'పరస్పర అంగీకారంతోనే మేమిద్దరం విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మా కుమార్తెకు సంతోషకరమైన జీవితాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నాం' అని వెల్లడించారు. ఈ సమయంలో తమ గోప్యతకు భంగం కలిగించొద్దని కోరారు. కుటుంబ విలువలు ఎంతో గొప్పవని తాను బలంగా నమ్ముతానని ఎలియా అన్నారు. ఈ నిర్ణయం తనకు ఏమాత్రం సంతోషం కలిగించేది కాదని, అయితే కొన్నిసార్లు విడిపోవడమే సరైన ఎంపిక అని తెలిపారు. 41 ఏళ్ల యువరాజు అల్బేనియా ప్రభుత్వంలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. గాయని, నటి అయిన ఎలియా.. అల్బేనియన్‌కు నేషనల్‌ థియేటర్‌ తరఫున ప్రదర్శనలు ఇచ్చిన అనుభవం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)