ఆటోపై పోలీస్ కానిస్టేబుల్‌ ప్రతాపం !

Telugu Lo Computer
0

త్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో ఈ నెల 19న బతువాలోని శీతల ఆలయం వద్ద ఎలక్ట్రిక్‌ ఆటో మలుపు తిరుగుతుండగా పోలీసులు వెళ్తున్న బైక్‌ను స్వల్పంగా ఢీకొట్టింది. దీంతో ఆ బైక్‌ వెనుక కూర్చొన్న పోలీస్‌ కానిస్టేబుల్‌ రాజేష్ రామ్ ఆగ్రహంతో రగిలిపోయాడు. చేతిలో ఉన్న లాఠీతో ఎలక్ట్రిక్‌ ఆటో అద్దాలు, లైట్లు పగులగొట్టి ధ్వంసం చేశాడు. కాగా, కొందరు వ్యక్తులు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డ్‌ చేసిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఆ కానిస్టేబుల్‌పై నెటిజన్లు మండిపడ్డారు. ఈ వీడియో పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్‌ రాజేష్ రామ్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఆయనపై డిపార్ట్‌మెంట్‌ దర్యాప్తు కూడా జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)