కొడుకును చంపేందుకు నెలక్రితమే ప్లాన్ చేసిందా ?

Telugu Lo Computer
0


ల్లిదండ్రుల మధ్య మనస్పర్ధలు వారి పిల్లల పాలిట ఎలా శాపంగా మారుతాయో.. సుచనా సేథ్ కొడుకు హత్య ఎపిపోడ్ నిదర్శనం. ఆర్థిక సమస్యలు లేవు. హోదా ఉంది. మంచి టాలెంటెడ్ అయిన తల్లిదండ్రులు.. ఇవన్నీ ఉన్న పిల్లలు ఎలా ఎదగాలి..వారి భవిష్యత్ ఎలా ఉండాలి..కానీ పాపం సుచనా సేథ్ కొడుకు.. అతని తల్లిదండ్రులను విడదీసిన వారి మధ్య మనస్పర్థలు, ఇగోలు.. చివరికి ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న ఆ చిన్నారి ప్రాణాలు తీశాయి. సుచనా సేథ్.. మంచి టాలెంటెడ్.. Mindful AI Lab స్టార్టప్ కంపెనీ ఫౌండర్, సీఈవో. అయినా ఇంత దారుణం ఎలా చేసింది. కేవలం కుటుంబ కలహాలేనా.. భర్తతో విడాకులు తీసుకున్న సుచనా సేథ్ మానసికంగా చాలా డిస్ట్రబ్ గా ఉందని పోలీసులు అంటున్నారు. సొంత కంపెనీ స్థాపించింది. ఆర్థిక సమస్యలు లేవు.. మంచి హోదా అయినా భర్తతో ఉన్న మనస్పర్థలు, వారి మధ్య ఇగోలు వారిని దూరం చేశాయి. చివరికి కన్న కొడుకు ప్రాణం తీసేలా చేశాయి. సుచనా సేథ్ విచారణ జరుగుతున్న క్రమంలో హత్య కు ముందు నెల రోజుల క్రితం తన ఇనస్టాలో కొడుకు ఫొటోలు షేర్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ అతని గురించి ఎలాంటి పోస్ట్ చేయలేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుచనా సేత్ కొడుకు హత్య కేసులో పోలీసులు విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలను పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. కుమారుడిని చూడటానికి భర్త వస్తున్నాడనే విషయం తెలిసి కుమారుడితో కలిసి బెంగళూరు నుంచి గోవా వెళ్లింది సుచనా అక్కడే తీవ్ర ఒత్తిడిలో గెస్ట్ హౌస్ లోనే తన కుమారుడిని తన చేతులతో గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత కుమారుడి శవాన్ని పెద్ద బ్యాగులో పెట్టుకుని క్యాబ్ బుక్ చేసుకుని బెంగళూరు బయలుదేరింది. హోటల్ గదిలో దిగినప్పుడు ఉన్న కుమారుడు వెళ్లే సమయంలో లేకపోవటం గదిలో రక్తపు మరకలు తుడిచిన ఆనవాళ్లు గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వటంతో దారి మధ్యలోనే క్యాబ్ డ్రైవర్ కు ఫోన్ చేసి పోలీసులు పట్టుకున్నారు. మాజీ భర్ తన కుమారుడిని చూడటం, కలవటం ఇష్టం లేక ఈ పని చేసినట్లు ఒప్పుకోవటం సంచలనంగా మారింది. ఈ మహిళా సీఈవో తీవ్ర ఒత్తిడిలో ఉందని.. టెన్షన్ గా ఉందని, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె చెప్పిన విషయాలు విని షాక్ అయ్యారు. ఇంత చిన్న విషయానికి కొడుకును చంపటం చూస్తుంటే ఆమె మానసిక పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు పోలీసులుచెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)