టీఎంసీ నేత సత్యన్‌ చౌదరి హత్య !

Telugu Lo Computer
0


శ్చిమ బెంగాల్‌ ముర్షిదాబాద్‌లో టీఎంసీ నేత సత్యన్‌ చౌదరి హత్యకు గురయ్యారు. బహరంపూర్‌ చల్తియా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు సత్యన్‌ చౌదరిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ముర్షిదాబాద్‌ ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. తీవ్ర గాయాలతో ప్రాణాలను కోల్పోయారు. సత్యన్ చౌదరి ముర్షిదాబాద్‌లో టీఎంసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. సత్యన్‌ చౌదరి ఇంతకు ముందు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్‌ పీసీసీ అధిర్‌ రంజన్‌ చౌదరికి ఆయన అత్యంత సన్నిహితంగా ఉండేవారు. కొద్దిరోజుల కిందట టీఎంసీలో చేరారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికార టీఎంసీకి చెందిన కీలక నేతపై కాల్పులు జరుగడం కలకలం సృష్టించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)