ఎంత మంచి ఆలోచన - అందరి సహకారంతో గదిని చక్కబెట్టారు !

Telugu Lo Computer
0

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ఒక వీడియో పోస్ట్‌ చేశారు. అందులో పిల్లలకు పరిశుభ్రతను అలవర్చుకోవటం నేర్పించే తీరుపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మహీంద్రా పంచుకున్న ఈ వీడియో అందరినీ ఆలోచించేలా చేస్తోంది. ఇంతకీ వీడియోలో ఏముందంటే చిన్నారులకు పరిశుభ్రత అలవాటు చేసేందుకు ఓ టీచర్‌ వినూత్న ఆలోచన చేసింది. విద్యార్థుల కంటే ముందుగా తరగతి గదికి వెళ్లి, ఆడుకొనే వస్తువులు, బొమ్మల్ని చిందరవందర చేస్తుంది. ఆ తర్వాత పిల్లల్ని క్లాస్‌లోకి అనుమతి ఇస్తుంది. గదిలోకి వచ్చిన పిల్లలు వెంటనే చెల్లాచెదురుగా ఉన్న వస్తువుల్ని సరిచేసి గదంతా శుభ్రం చేస్తారు. ఈ ఆలోచన రేకెత్తించే వీడియోను మహీంద్రా తన 'ఎక్స్‌' ఖాతాలో పోస్ట్‌ చేశారు. 'ఎంత మంచి ఆలోచన. అందరి సహకారంతో గదిని చక్కబెట్టారు. ప్రీ, ఎలిమెంటరీ పాఠశాల్లో ఇటువంటి విధానాన్ని మనం భాగం చేయగలమా?' అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)