వెండి చీపురు బహూకరణ !

Telugu Lo Computer
0


యోధ్యలోని రామ మందిరంలో రాముని ప్రాణ ప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే.. ఎంతో కన్నుల పండుగగా విగ్రహ ప్రతిష్ట జరిగింది.. రాముని భక్తులు ఆలయానికి భారీగా విరాళాలను అందిస్తున్నారు. రామ భక్తులు ఆయనకు వెండి చీపురును బహుకరించారు. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అఖిల భారత మోంగ్ సమాజ్ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు వెండి చీపురును బహుమతిగా ఇచ్చింది. ఆల్ ఇండియా మోంగ్ సమాజ్ బాల రాముని గర్భగుడిని శుభ్రం చేయడానికి 1.751 కిలోల బరువున్న వెండి చీపురును బహుమతిగా ఇచ్చింది. ఈ వెండి చీపురు తయారీకి11 రోజుల సమయం పట్టిందట. చీపురు పైభాగంలో లక్ష్మీ దేవి చిత్రం కూడా చెక్కబడి ఉంటుంది. ఈ వెండి చీపురులో 108 పుల్లలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ట్రస్ట్ సభ్యుడు మధుకర్ రావు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే తొలి వెండి చీపురును శ్రీరాముడికి అంకితమిచ్చామన్నారు. అయోధ్యలో రామ్‌ లల్లా ప్రాణ ప్రతిష్ట రోజు అయిన జనవరి 22న దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకున్నారని చెప్పారు… దీపావళి పండుగకు లక్ష్మీ దేవిని పూజిస్తారు.. అలాగే ఈ నెల 22 న కూడా దీపావళి జరుపుకుంటారు.. అందుకే అమ్మవారి గుర్తుగా వెండి చీపురును బహుకరించినట్లు ఆయన తెలిపారు.. ప్రస్తుతం ఈ వెండి చీపురు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

Post a Comment

0Comments

Post a Comment (0)