మొసాద్ ఏజెంట్లను ఉరితీసిన ఇరాన్ !

Telugu Lo Computer
0


రాన్ తన ప్రధాన శత్రువు ఇజ్రాయిల్ కోసం గూఢచర్యానికి పాల్పడుతున్న నలుగురుకి ఉరిశిక్ష విధించింది. దోషులుగా తేలడంతో వారిని సోమవారం తెల్లవారుజామున ఉరితీసినట్లు టెహ్రాన్ న్యాయవ్యవస్థ తెలిపింది. సెంట్రల్ ప్రావిన్స్ ఆఫ్ ఇస్పాహాన్‌లో బాంబు దాడికి కుట్ర పన్నినందుకు, జియోనిస్ట్ (ఇజ్రాయిల్) గూఢచార సంస్థకు చెందిన నలుగురు సభ్యులకు ఈ రోజు మరణశిక్ష అమలు చేసినట్లు న్యాయవ్యవస్థ వెబ్‌సైట్ మిజాన్ ఆన్‌లైన్ నివేదించింది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి వెనక ఇరాన్ ఉందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. మరోవైపు ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీల దాడులను ఇరాన్ ప్రోత్సహిస్తోందని అమెరికా, వెస్ట్రన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)