జనసేనలో చేరిన పృధ్వీరాజ్, జానీ మాస్టర్ !

Telugu Lo Computer
0


టుడు పృధ్వీ రాజ్, ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లు జనసేన పార్టీలో చేరారు.. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఇద్దరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జనసేనాని పవన్ కల్యాణ్… గతంలో వైసిపిలో ఉన్న పృధ్వీ ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తాజాగా ఆయన జనసేన తీర్ధం తీసుకున్నారు. ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. నిజానికి కొద్ది రోజుల నుంచి ఏపీలో జానీ మాస్టర్ యాక్టివ్గా పర్యటనలు చేశారు. కొన్నాళ్ల క్రితం నెల్లూరులో అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న ఒక పోరాటానికి సైతం ఆయన మద్దతు పలుకుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అంతే కాదు డిసెంబర్ 29వ తేదీన కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్యని కూడా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన నేతలతో కలిసి హరినామ జోగయ్యను పాలకొల్లు నివాసంలో కలిసి మాట్లాడడంతో జానీ మాస్టర్ జనసేన అభ్యర్థిగా ఏదో ఒక చోట నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)