అత్తగారి కల నెరవేర్చిన ఖుష్బూ !

Telugu Lo Computer
0


ప్రధాని నరేంద మోడీని కలుసుకోవాలన్న తన అత్తగారి కలను నటి, బిజెపి నాయకురాలు, జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్లు) సభ్యురాలు ఖుష్బూ సుందర్ నెరవేర్చారు. వారి సమావేశానికి సంబంధించిన పలు ఫోటోలు పోస్ట్ చేసిన ఖుష్బూ ప్రధాని మోడీని ప్రశంసిస్తూ సుదీర్ఘ వ్యాసం రాశారు. 'మన గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపేందుకు ఏ మాటలూ సరిపోవు. 92 ఏళ్ల వయస్సులో శ్రీమతి దైవనై చిదంబర్ పిళ్లై' మోడీకి పెద్ద అనుచరురాలు, అభిమాని. ఇది ఆమెకు ఎంతో ఉత్సుకతతో కూడిన క్షణం. ఎందుకంటే ఆయనను కనీసం ఒక్కసారైనా కలుసుకోవాలన్నది ఆమె కల' అని ఆమె 'ఎక్స్'లో రాశారు. 'ప్రపంచంలో అత్యంత జనాదరణ ఉన్న, అభిమానపాత్రుడైన, ఎటువంటి ఆభిజాత్యం లేని మన ప్రధాని ఎంత సాదరంగా, గౌరవంతో ఆమెను స్వాగతించారు. తన తల్లితో ఒక కుమారుడు మాట్లాడినరీతిలో ప్రేమాభిమానాలతో ఆయన సంభాషించారు. ఆయన భగవంతుని కృపకు ఎంతైనా అర్హుడు' అని ఖుష్బూ రాశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)