నేతాజీ జయంతికి ఎందుకు సెలవు ఇవ్వలేదు ?

Telugu Lo Computer
0


నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని సెలవు ప్రకటించకపోవడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రామమందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు ప్రకటించడాన్ని ప్రస్తావించిన దీదీ.. “రాజకీయ ప్రచారం” కోసం సెలవులు మంజూరు చేశారని విమర్శించారు. రాజకీయ కార్యక్రమాలకు సెలవులు ఇచ్చినందుకు తాను సిగ్గుపడుతున్నాను, కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తులకు ఏమీ చేయడం లేదని మమతా తెలిపారు. నేతాజీ జన్మదినాన్ని జాతీయ సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటించేలా 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నానని.. కానీ నన్ను క్షమించండి, నేను విఫలమయ్యాను అని ఆమె అన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)