జ్యూస్లో మూత్రం కలిపి త్రాగించిన సహచర విద్యార్థులు !

Telugu Lo Computer
0


మిళనాడులోని తిరుచిరాపల్లి తమిళనాడు నేషనల్ లా యూనివర్శిటీలో లా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు తమ క్లాస్‌మేట్‌కు మూత్రంలో జ్యూస్ కలిపి తాగించారు. ఈ కారణంగా యూనివర్సిటీ యాజమన్యం ఆ ఇద్దరు విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది. బాధిత విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం జనవరి 6న తన తోటి విద్యార్థులు ఇచ్చిన జ్యూస్‌ను తాగినట్లు చెప్పాడు. కాగా ఆ మరుసటి రోజు నుంచి క్లాస్‌రూమ్ లో అతన్ని సహ విద్యార్థులు హేళన చేయడం ప్రారంభించరాన్నారు. చివరకు తనను ఎందుకు ఇలా చేస్తున్నారని తెలుసుకున్న బాధిత విద్యార్థికి జ్యూస్ లో మూత్రం కలిపి ఇచ్చారని తెలిసిసింది. దీంతో ఆ విద్యార్థి వైస్‌ ఛాన్సలర్‌ వి. నాగరాజ్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న యూనివర్సిటీ యజమాన్యం, ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జనవరి 18న తన నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో ఈ ఘటనకు పాల్పడ్డ విద్యార్థులను ప్రస్తుత సంవత్సరంలో 10వ-సెమిస్టర్ పరీక్షలకు హాజరుకాకుండా ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేసింది. అంతేకాకుండా ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని రామ్‌జీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)