చిరంజీవిని అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లి ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించబడినందుకు చిరుకి తెలుగు పరిశ్రమ గర్విస్తుందన్నారు. మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని, మరిన్ని అవార్డులను చిరంజీవి పొందాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఆయన సినీ కెరీర్ లో ఎన్నో సందేశాత్మక సినిమాలు నటించారని, అంతేకాకుండా..చిరంజీవికి భారత రత్నతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా రావాలని కోరుకుంటున్నానని మంత్రి వెంకట్ రెడ్డి తెలిపారు. కోమటి రెడ్డి వెంట ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)